విషాదం..పెళ్ళికి ముందు రోజు పెళ్లి కూతురు, ఆమె తల్లి ఆత్మహత్య

100

పెళ్ళికి ముందు రోజు పెళ్లి కూతురు, ఆమె తల్లి ఆత్మహత్య

డిసెంబర్ 11 న పెద్ద కూతురు వివాహం. ఎం కష్టం వచ్చిందో ఏమో, తల్లి ఇద్దరు కూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని మూడో పట్టన ప్రాంతానికి చెందిన గోవిందమ్మ (48), ఆమె కూతుళ్లు రాధికా (30), రమ్య (28) బుధవారం అర్ధరాత్రి బంగారం శుభ్రం చేసే రసాయనం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాగా వీరిది నిరుపేద కుటుంబం, భార్య భర్తలు పనికి వెళ్లగా వచ్చిన డబ్బు కుటుంబ పోషణకే సరిపొయ్యేవి. ఇక ఈ తరుణంలోనే పెద్ద కూతురు పెళ్లి కుదిరింది. కట్నకానుకలు మాట్లాడుకున్నారు. గురువారం రాధికను పెళ్లికూతురిని చేసి, శుక్రవారం పెళ్లి జరిపించాల్సి ఉంది. అయితే కట్నం డబ్బు సమకూరాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.