Breaking news : మదనపల్లె కేసును కోర్టులో వాదించనున్న పీవీ కృష్ణమాచార్య

274

Madanapalle case braking news : చిత్తూరు జిల్లా మదనపల్లెలో జంట హత్యల కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసులో విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఇక హత్య చేసినట్లుగా భావిస్తున్న తల్లి పద్మజ, తండ్రి పురుషోత్తం నాయుడి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారిని విశాఖ మానసిక రోగుల కేంద్రానికి తరలించారు. అక్కడ వారు కుదుటబడే వరకు వైద్యం అందించే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే కోర్టులో ఈ భార్యాభర్తల తరపున వాదించేందుకు ప్రముఖ లాయర్ పీవీ కృష్ణమాచార్య ముందుకు వచ్చారు. కృష్ణమాచార్య దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ కేసును కూడా వాదిస్తున్నారు. ఆయన దిశ కేసులో పోలీసుల ఎన్కౌంటర్ చెయ్యడని తప్పు పడుతూ నిందితుల కుటుంబ సభ్యుల తరపున వాదిస్తున్నారు.

మదనపల్లె కేసు విషయమై పురుషోత్తం నాయుడి పూర్వవిద్యార్థులు కృష్ణమాచార్యతో ఫోన్ లో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. మీరైతేనే ఈ కేసులో వాదించగలరని ఆయనను బ్రతిమాలడంతో కేసు తీసుకునేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసు వివరాలను తన జూనియర్ రజని ద్వారా సేకరించారు కృష్ణమాచార్య. హైకోర్టు, సుప్రీమ్ కోర్టులలో వాదించడానికి దైర్యం చెయ్యని కేసులను కూడా కృష్ణమాచార్య వాదించారని సమాచారం.

Breaking news : మదనపల్లె కేసును కోర్టులో వాదించనున్న పీవీ కృష్ణమాచార్య