మళ్ళీ బ్రేక్.. ఎక్కడలేని కష్టాలన్నీ భారతీయుడికే!

241

సుమారు పాతికేళ్ల క్రితం వచ్చింది భారతీయుడు సినిమా. ఈ సినిమా కమల్ హాసన్ అంటే గ్రేట్ యాక్టర్ అనే ముద్ర వేస్తే దర్శకుడు శంకర్ సినిమా తీస్తే హిట్ గ్యారంటీ అనే టాక్ తెచ్చుకుంది. అందులో ఏఆర్ రెహమాన్ పాటలు ఇప్పటికీ నోళ్ళలో నానెంతగా మారు మ్రోగుతుంటే.. ఆ సినిమా తెచ్చిన గ్రాండ్ లుక్ కోసం ఇప్పటికీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాగా పాతికేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ భారతీయుడు-2కి ఎక్కడలేని కష్టాలన్నీ వచ్చి పడుతున్నాయి.

ఏళ్ల తరబడి సాగుతున్న ఈ సినిమా షూటింగ్ కు తగ్గట్లే ఫిబ్రవరి నెలలో క్రేన్ విరిగిపడి షూటింగ్ స్థలంలో ఘోరమైన ప్రమాదం జరిగింది. దాని నుండి కోలుకొని మళ్లీ షూటింగ్ ప్రారంభించేలోపు కరోనా వైరస్ లాక్ డౌన్ తెచ్చేసింది. దాని వలన అనుకున్న షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ఇబ్బందుల నుండి కోలుకొని మళ్ళీ కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేసి షూటింగ్ వెళ్దాం అనుకుంటుండగా డిఓపి రత్నవేలు ఈ సినిమా నుండి తప్పుకున్నారని అరవ సీమ నుండి వినిపిస్తున్న టాక్.

ఈ సినిమాకు ముందుగా రవివర్మన్ అనుకున్నారు. కానీ అయన తప్పుకోవడంతో రత్నవేలు వచ్చాడు. ఇప్పుడు రత్నవేలు కూడా తప్పుకున్నాడని టాక్ నడుస్తుంది. అసలు ఈ సినిమా పరిస్థితి ఏంటో అర్ధంగాకనే రత్నవేలు తప్పుకున్నారని చెప్తున్నారు. ఇక.. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తుండగా కొత్తగా మరోసారి ఈ ఇద్దరి కాల్ షీట్స్ కోసం దర్శక, నిర్మాతలు ప్రయత్నిస్తుండగా అసలే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్ బిజీగా మారితే పరిస్థితి ఏంటా అన్నది మరింత అనుమానాలను రేకెత్తిస్తుంది.

మళ్ళీ బ్రేక్.. ఎక్కడలేని కష్టాలన్నీ భారతీయుడికే!