ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిపై కత్తితో దాడి

144

ప్రేమపేరుతో యువతులపై దాడి చేస్తున్న వారి అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత కొంతకాలం ప్రేమపేర అమ్మాయిలపై దాడు విపరీతంగా పెరిగాయి. ప్రేమించమని వేధించడం, ఒప్పుకోకపోతే వధించడం.. దాడిచేసి గాయపరచడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు కొందరు ప్రేమోన్మాదులు.. వీరి బారినపడి యువతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా శుక్రవారం కడప జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

తనను ప్రేమించడంలేదని ఓ యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రొద్దుటూరులో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే సునీల్ అనే యువకుడు, లావణ్య అనే యువతిని ప్రేమ పేరుతో మూడు నెలలుగా వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే లావణ్య వాళ్ళఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఇంటికి వెళ్లి తన ప్రేమను ఒప్పుకోవాలని బెదిరించాడు.

అయితే లావణ్య సస్సేమిరా అనడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేసి పారిపోయాడు. యువతి కేకలు విని పరుగుపరుగున వచ్చిన చుట్టుపక్కలవారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సునీల్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సునీల్ కోసం గాలింపు చేపట్టారు.

ప్రేమోన్మాది ఘాతుకం