దుస్తులపై నుండి తాకితే వేధింపు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

175

మన సమాజంలో మహిళలపై వేధింపులు.. అత్యాచారాలు.. అఘాయిత్యాలు.. అపహరణాల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని వణికించిన ఘటనలు జరిగినా.. మృగాళ్లకు ఉరిశిక్షలు వేసినా.. ఎన్కౌంటర్ లు చేసినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. అమ్మ పొత్తిళ్ళలోని పసికందులు సైతం ఈ వేధింపులకు అతీతం కాదనే ఘటనలు సైతం ఇప్పటికే అందరం చూశాం. ఇప్పటికే మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చట్టాలు చేసినా అవేవీ మదమెక్కిన మృగాళ్లను ఆపలేకపోతున్నాయి.

అయితే.. అసలు న్యాయవ్యవస్థలో లొసుగులు.. అలసత్వం కూడా ఓ కారణంగా పలుమార్పు మేధావులు చర్చలు కూడా పెట్టారు. ఇక, తాజాగా బాంబే హైకోర్టు ఓ వేధింపుల కేసులో ఇచ్చిన తీర్పు మరో సంచలనంగా మారింది. ఓ 12 ఏళ్ల బాలికపై 39 ఏళ్ల వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లుగా కేసు నమోదైంది. ఈ కేసులో కింది కోర్టు ఆ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను కూడా ఖరారు చేసింది. అయితే.. హైకోర్టులో మాత్రం ఆ కేసును కొట్టేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు సైతం న్యాయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఓ బాలిక వక్షస్థలాన్ని దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు ఇచ్చింది కూడా ఓ మహిళా న్యాయమూర్తి కావడం మరో విశేషం. నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలా తీర్పులో భాగంగా.. దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదని తేల్చారు. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొన్నారు. కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను కొట్టి వేశారు.

దుస్తులపై నుండి తాకితే వేధింపు కాదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు