ప్రధాని లక్ష్యంగా ఉగ్రదాడి.. 30 మంది మృతి

62

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజు ప్రపంచంలో ఎక్కడో ఓ చోట మారణహోమం సృష్టిస్తూనే ఉన్నారు. నైజీరియా ఘటన మరువకముందే, యెమెన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బుధవారం యెమెన్ నూతన ప్రధానిని, వారి క్యాబినెట్ ను టార్గెట్ చేస్తూ రాకెట్ లాంఛర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా యెమెన్ లో గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతుంది. ఈ అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పౌరులు మృతి చెందారు. సుదీర్ఘ కాలంగా యెమెన్‌లో అస్థిరత్వం నెలకొంది. దీనిని అడ్డుకునేందుకే డిసెంబర్ 18న కొన్ని వేర్పాటువాద సంస్థలు, ప్రభుత్వం కలిసి ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. అధికార భాగస్వామ్యం పద్ధతిలో కేబినెట్‌ను ఏర్పాటు చేశాయి.

యెమెన్‌లో తాజాగా కొత్త మంత్రి వర్గం ఏర్పడి నూతన ప్రధాని ఎంపిక జరిగింది. ఈ పరిణామంపై ఆ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రధానికి ఘనస్వాగతం పలికేందుకు ఆదెన్ విమానాశ్రయానికి వెళ్లారు. ప్రధాని కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రధానితోపాటు, క్యాబినెట్ మెంబెర్స్ విమానంలోంచి దిగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఓ బాంబు పేల్చారు.

దింతో ప్రజలు పరుగులు తీశారు. ఇంతలోనే విమానాశ్రయంలోని ముఖద్వారం వద్ద గ్రానైట్ లాంచర్ విసిరారు. ఈ రెండు దాడుల్లో 30 మంది మృతి చెందారు. చాలామందికి తీవ్ర గాయాలయ్యాయి. దింతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది. బాంబు దాడిలో చనిపోయిన వారి శరీర భాగాలు తెగి చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక్కసారిగా చుట్టూ పొగ అలముంకుంది.

ఈ ఊహించని దాడితో ప్రజలు పరుగులు తీశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇటువంటి ముర్కమైన దాడులతో తమను బయపెట్టలేరని తాము తలపెట్టిన పవిత్ర కార్యాన్ని అడ్డుకోలేరని నూతన మంత్రి వర్గం ప్రకటించింది. అయితే దాడి జరిగిన తర్వాత దుండగులు కాల్పులకు కూడా పాల్పడినట్లు సమాచారం.

ప్రధాని లక్ష్యంగా ఉగ్రదాడి.. 30 మంది మృతి