ఘోర ప్రమాదం.. 5 కోట్ల డాలర్ల నష్టం

622

ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. హెరాత్ ప్రావిన్స్ లో ఈ నెల 13 న భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడులో 500 పైగా పెట్రోల్, గ్యాస్ తరలించే ట్యాంకర్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రత భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ మీడియా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ పేలుడుకు సంబందించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ శాటిలైట్ తన హైరెజల్యుషన్ కెమెరాతో తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

May be an image of outdoors

మక్సర్‌కు చెందిన వరల్డ్‌వ్యూ-3 శాటిలైట్ బుధవారం ఈ ఫొటో తీసింది. ఈ పేలుడులో సహజ వాయువు, ఇంధనంతో ఉన్న 500కుపైగా ట్రక్కులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ఎంత భారీగా ఉందంటే.. దీని ధాటికి ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ పవర్ సరఫరాను నిలిపేయాల్సి వచ్చింది. ఊహించిన దాని కంటే ఇది చాలా పెద్ద ప్రమాదమేనని హెరాత్ చాంబర్ ఆఫ్ కామర్స్ చీఫ్ యూనస్ ఖాజీ జాదా చెప్పారు. ఈ పేలుడు వలన సుమారు 5 కోట్ల డాలర్ల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

May be an image of outdoors

ఘోర ప్రమాదం.. 5 కోట్ల డాలర్ల నష్టం