మంత్రిపై బాంబు దాడి.. తీవ్ర గాయాలు

90

పశ్చిమ బెంగాల్ కార్మికశాఖామంత్రి జాకీర్ హుస్సేన్ పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. ఈ సంఘటన ముర్షిదాబాద్ లోని నిమ్తితా రైల్వేస్ స్టేషన్ లో జరిగింది. కోల్ కత్తా వెళ్లేందుకు రాత్రి 10 గంటల సమయంలో రైల్వేస్ స్టేషన్ కి వచ్చారు. ఈ సమయంలోనే అతడిపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రితో పాటు మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని జంగీపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మంత్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బాంబు దాడి అనంతరం దుండగులు పారిపోయారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బెంగాల్ లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ ఏడాది జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రచారంలో పాల్గొని వస్తున్న సమయంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తుంది. మంత్రి నిమ్తితా రైల్వేస్ స్టేషన్ కు వస్తాడనే విషయం తెలుసుకొని కాపుకాసి ఈ దాడికి పాల్పడినట్లుగా సమాచారం.

మంత్రిపై బాంబు దాడి.. తీవ్ర గాయాలు