ఆసుపత్రిలో బాంబు పెట్టిన దుండగులు

81

గుర్తు తెలియని వ్యక్తులు నోయిడాలోని సెక్టార్ 63లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి వద్ద శుక్రవారం తెల్లవారుజామున బాంబు లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లుగా చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు బాంబును స్వాధీనం చేసుకొని నిర్వీర్యం చేశారు. బాంబు ఎవరు పెట్టి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే గురువారం నాడు నోయిడాలోని సెక్టార్ 27 లో గల కైలాష్ ఆస్పత్రిలో లో బాంబు పెట్టినట్లు ఆ ఆస్పత్రి ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. దింతో పోలీసులు బాంబును గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఎక్కడ బాంబు దొరకకపోవడంతో ఫేక్ కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరుసటిరోజే మరో దగ్గర బాంబు దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రి వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకోని వారిని విచారిస్తున్నారు.

ఆసుపత్రిలో బాంబు పెట్టిన దుండగులు