#1 on Vooru Vaada బొల్లారం : కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

177

సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్య ఆర్గానికి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఆ కంపెనీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. కంపెనీలో పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలార్పుతోంది. అయితే పేలుడు ధాటికి కొంతమంది మరణించి ఉండొచ్చని ఫైర్ సిబ్బంది అనుమానిస్తున్నారు.