BJP: ఏడాది తర్వాత మొదలైన పార్లమెంటరీ పార్టీ సమావేశం

1238

BJP: కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలను నిర్వహించనేలేదు. అయితే.. ఏడాది తర్వాత మళ్ళీ బుధవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్‌ భవనంలో ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, స్మృతి ఇరానీ, ప్రహ్లాద్‌ పటేల్ తదితరులు హాజరయ్యారు.

ప్రస్తుతం రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కాగా ఈ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా ఉత్తరాఖండ్‌ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం తివ్రేంద్రసింగ్‌ రావత్ సీఎం పదవికి రాజీనామా‌ చేసిన విషయం తెలిసిందే. సీఎం పదవి రేసులో ఉన్నట్లు పేర్కొన్న బీజేపీ వర్గాలు ఈ భేటీలో కొత్త సీఎం ఎంపికపై చర్చించి, ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.