బీజేపీకి రెండంకెల సీట్లు కూడా రావు – ప్రశాంత్ కిషొర్

127

బెంగాల్ కోటపై పాగా వెయ్యాలని గట్టి ప్రయత్నాలే చేస్తుంది కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ. దేశం మొత్తం ఇప్పటికే కాషాయ పవనాలు వీస్తున్న సమయంలో.. అమిత్ షా కూడా పశ్చిమ బెంగాల్‌లో తిరిగి వచ్చారు. రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు అమిత్ షా వచ్చిన సమయంలో BJPలో చేరగా.. ఫుల్ జోష్‌లో ఉంది కమలదళం. ఎలాగైనా రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ప్రయత్నాలపై లేటెస్ట్‌గా దీదీ పార్టీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి క్రియాశీలకంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో అధికారం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి కనీసం రెండు డిజిట్ల సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. మమత కోటలో బీజేపీ పాగా వేసే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే బెంగాల్‌లో బీజేపీకి పట్టుమని పది సీట్లు కూడా రావన్నారు.

వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మమతను దించాలని బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే ఆ పార్టీలోని అసమ్మతి నేతలను బీజేపీ చేర్చుకోగా.. బెంగాల్ పర్యటనలో భాగంగా.. అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ 200 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మమతను ఇంటికి పంపడం ఖాయమన్నారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లేటెస్ట్‌గా కౌంటర్ ఇచ్చారు ప్రశాంత్ కిషోర్.

&nbsp