బీజేపీ మూర్కులు అంటు ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు

184

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కొత్త బిచ్చగాడని అన్నారు. నాలుగు సార్లు ఓడిపోయాడు అనే సానుభూతితో ప్రజలు సంజయ్ కి ఓట్లు వేశారని, సంజయ్ కి ఇదే మొదటి, చివరి పదవి అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు ఉరికిచ్చి కొడతారని అన్నారు.

బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని దయాకర్ రావు అన్నారు. బండి సంజయ్ కి కేసీఆర్ ను జైల్లో పెట్టె దమ్ముందా అని ప్రశ్నించారు. సంజయ్‌కు చేతనైతే కేంద్రం నుంచి నీళ్ల వాటా తీసుకురావాలి సూచించారు. బండి సంజయ్‌ మతకలహాలు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. బీజేపీ మూర్ఖులు మత ఘర్షణలు పెట్టాలని చూస్తున్నారు’ అని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు.

బీజేపీ మూర్కులు అంటూ ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు