బీజేపీ మోర్ఛాలకు అధ్యక్షులను నియమించిన బండి

263

రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. సంస్థాగతంగా బలపడేందుకు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టింది. బీజేపీ మోర్చాలకు ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ నేత బండి సంజయ్‌ నియమించారు.

బీజేపీ యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా దుగ్యాల ప్రదీప్‌ను. కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ప్రేమేంధర్‌రెడ్డిని, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా బంగారు శృతిని ఎన్నుకున్నారు. మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా రాంచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా మనోహర్‌రెడ్డి, బీసీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా యెండల లక్ష్మీనారాయణ, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు.

ఇక జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో పార్టీని బలపరిచేందుకు అధ్యక్షుడు కృషి చేస్తున్నాడు. పార్టీలోని అందరిని కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. అసమ్మతి లేకుండా, పదవులు ఇస్తున్నారు. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారికి అవకాశం ఇస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికీ పార్టీకి సంబందించిన పలు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

బీజేపీ మోర్ఛాలకు అధ్యక్షులను నియమించిన బండి