నాన్న పరీక్ష మంచిగా రాయి… ఎమ్మెల్యేకు కూతురు సలహా

191

వివిధ కారణాలతో మధ్యలోనే చదువు మానేసిన వారు.. సమస్యలు కుదుటబడిన తర్వాత ఓపెన్ లోనో.. లేదంటే రెగ్యులర్ గానో చదువు మొదలు పెడతారు. అయితే ఇలా చదివే వారు కొందరు వారి పిల్లలకంటే తక్కువ తరగతి పరీక్షలు రాస్తుంటారు. ఒక్కోసారి పిల్లలతో కలిసి కూడా పరీక్షలు రాస్తుంటారు. అయితే తాజాగా ఓ ఎమ్మెల్యే ఓపెన్ డిగ్రీ పరీక్షా రాసేందుకు వెళ్ళాడు. అయితే ఆయన పిల్లలు పరీక్షా బాగా రాయండి నాన్న అంటూ దైర్యం చెప్పి పంపారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌ రూరల్‌ ఎంఎల్‌ఏ ఫూల్‌ సింగ్‌ మీనా ఏడవ తరగతి చదువుతుండగా ఆర్మీలో పనిచేస్తున్న తన తండ్రి మరణించాడు.

దింతో కుటుంబ పోషణ కోసం చదువు మానేసి పొలం పనులకు వెళ్లాల్సి వచ్చింది. తన చదువుకు చిన్నతనంలోనే బ్రేక్ పడింది. ఆ తర్వాత కొన్నేళ్ళకు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆలా మెల్లిగా ఎదుగుతూ 2013లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా సేవ చేస్తున్న సమయంలో ఖాళీ సమయం దొరకడంతో తన కూతుర్లు చదువుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దింతో ఎమ్మెల్యే 2013లో పదోతరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యారు. ఇక ఇప్పుడు డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాస్తున్నారు ఫుల్ సింగ్ మీనా.. ఈ నేపథ్యంలోనే నాన్న పరీక్షలు మంచిగా రాయండి అంటూ తన కూతుర్లు చెప్పి పంపారు.

ఇక ఎమ్మెల్యేకు ఐదుగురు కుమార్తెలు ఉండగా వారంతా ఉన్నత చదువులు చదివిన వారే కావడం విశేషం. నలుగురు కూతుర్లు పీజీ పూర్తి చెయ్యగా, చిన్న కూతురు పీజీ చదువుతున్నారు. ప్రతి రోజు వీరు చదువుకోవడం పూర్తి కాగానే తనకు చదువు చెబుతారని ఎమ్మెల్యే గర్వాంగా చెప్పారు. తాను పీజీ కూడా చేస్తానని ఫుల్ సింగ్ మీనా తెలిపారు.

నాన్న పరీక్ష మంచిగా రాయి… ఎమ్మెల్యేకు కూతురు సలహా