రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు

333

రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్. ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఓ సినిమా హీరోకు ఉన్నంత అభిమాన గణం రేవంత్ కి ఉంది. ఇక్కడే కాదు ఆంధ్రలో కూడా రేవంత్ రెడ్డికి చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన ఫోటో తమ వాహనాలపై వేసుకొని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు ఆంధ్రలోని కొందరు అభిమానులు.

పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న రేవంత్ గత కొద్దీ రోజులుగా కొందరు అభిమానులను దూరం చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న రేవంత్ ఇంతకాలం అధికార టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించే వారు. కానీ ఇప్పుడు బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ విజయాలు గాలివాటపు విజయాలుగా పోల్చుతున్నారు రేవంత్.

అయితే రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీలోని తన అభిమానులు కొంత దూరం జారుతుగున్నట్లు కనిపిస్తుంది. ఇంతకాలం ప్రశ్నించే గొంతుకకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ సానుభూతిపరులను రేవంత్ తన మాటలతో దూరం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో బలపడుతున్న బీజేపీపై గరం గరం వ్యాఖ్యలు చేస్తుండటం బీజేపీ కార్యకర్తలు రేవంత్ కు దూరమయ్యేలా చేస్తున్నాయి.

తాజగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రేవంత్ మాట్లాడుతూ దుబ్బాకలో గెలిచి గ్రేటర్ లో 40 కార్పొరేటర్లను గెలిపించుకుంటే సరిపోతుందా? మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క జడ్పీటీసీని కూడా బీజేపీ ఎందుకు గెలిపించుకోలేక పోయింది అంటూ ప్రశ్నలు సంధించారు. అయితే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు, సానుభూతిపరులు. తమ పార్టీది గాలివాటకు గెలుపు కాదని, నికార్సైన విజయమని అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో 150 స్థానాల్లో రెండు స్థానాల్లో గెలిపించుకోగలిగారని, కాంగ్రెస్ బలం ఏంటో ఇక్కడే అర్థమైందని అంటున్నారు. బీజేపీ కార్యకర్తలు గత ఎన్నికల్లో రేవంత్ కి ఓటు వేశారని. ప్రశ్నించే గొంతుకను పార్లమెంట్ కు పంపాలనే ఉద్దేశంతోనే తాము ఈ విధంగా చేశామని, కానీ తమను బాధపెట్టే విధంగా రేవంత్ మాటలు ఉన్నాయని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు. తాము లేకుండా రేవంత్ పార్లమెంట్ లో అడుగు పెట్టేవాడా అని ప్రశ్నిస్తున్నారు.

ఇక రాజకీయాల్లో గెలుపోటములు సహజం అన్న రేవంత్ బీజేపీ గెలుపును ఎందుకు స్వాగతించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. గాలివాటపు గెలుపు అని ఆయన ఎలా నిర్దారిస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా రేవంత్ రెడ్డి ఈ మధ్య బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రైతుల బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్లిమరీ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు రేవంత్.

రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు