బీజేపీ పాదయాత్ర.. ప్రకటన చేసిన బండి సంజయ్

265

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకు పాదయాత్ర చేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాజకీయ లవ్ జిహాద్ చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో 2023లో బీజేపీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయేలో చేరదామని మంత్రులను కేసీఆర్ మభ్యపెడుతున్నారని బండి అన్నారు. కేసీఆర్ ను కేంద్ర పెద్దలు నమ్మడం లేదని తెలిపారు.

ఇక ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకోమని బండి తెలిపారు. తప్పులు ఒప్పుకొని పాప పరిహారం చేసుకుంటే ఆలోచిస్తామని అన్నారు. మేము గేట్లు తెరిస్తే టీఆర్ఎస్ ఖాళీ అవుతుందని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని బండి వ్యాఖ్యానించారు. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 10 వరకు రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి రామమందిర నిధిని సేకరిస్తామని తెలిపారు. ప్రతి హిందువు గడపకు వెళతామని వివరించారు బండి.

బీజేపీ పాదయాత్ర.. ప్రకటన చేసిన బండి సంజయ్