బీజేపీ కార్యక్రమాలకు అడ్డుకున్న నిరసన కారులు.. బీజేపీ అధ్యక్షుడికి గాయాలు

57

రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారత రైతులు పెద్దే ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనల్లో ఇప్పటికే 30 మంది వరకు రైతులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు రైతు మద్దతు దారులు. శుక్రవారం పంజాబ్ రాష్ట్రంలో మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేపట్టింది.

ఈ కార్యక్రమాలను రైతు మద్దతు దారులు అడ్డుకున్నారు. స్టేజ్ లను ధ్వంసం చేశారు. బీజేపీ నేతలపై రాళ్ళూ రువ్వారు. పంజాబ్ లోని బదిండాలో రాళ్ళూ రువ్వడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ గుప్తాతో పాటు మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు

ఇక రాష్ట్రంలో మరి కొన్ని చోట్ల వాజ్ పేయి జయంతి వేడుకలను అడ్డుకున్నారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా పలు చోట్ల పోలీసులు లాఠీ ఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక ఆందోళన కారులు సెల్ టవర్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు.

రాష్ట్రంలో సుమారు 1000 టవర్లు ధ్వంసం అయినట్లుగా తెలుస్తుంది. ఇక పలువురిపై కేసులు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు. మరోవైపు ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ట్రాక్టర్లతో బారికేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వేల సంఖ్యలో ట్రాక్టర్లు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వచ్చి ఉన్నాయి.

మరో వైపు రాజస్థాన్ నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ వచ్చారు. రైతు చట్టాలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై రక్షణ శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. చట్టాలను రెండేళ్లపాటు చూడాలని రైతులకు నచ్చకపోతే రద్దు చేసే ఆలోచన చేస్తామని తెలిపారు. చట్టాలు అమలై వాటి ప్రతిఫలం రాకముందే రైతులు వెనక్కు తీసుకోవాలి అనడం మంచి పద్దతి కాదని సూచించారు రాజ్ నాథ్ సింగ్.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రైతులతో సుదీర్ఘ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తుంది. ఇప్పటికే ఆరేడు, దఫాలుగా చర్చలు జరిపినప్పడికి అవి కొలిక్కి రాలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులకు అంగీకరించింది. కానీ రైతు సంఘాలు మాత్రం చట్టాలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతె ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు.

మరోవైపు రైతు ఉద్యమానికి ఢిల్లీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రాజస్థాన్, పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఇక బీజేపీ యేతర ప్రభుత్వాలు రైతులకు మద్దతుగా నిలిచేందుకే మొగ్గు చూపుతున్నాయి.