బీజేపీ కార్పొరేటర్ కారుపై దాడి

62

హైదరాబాద్ మైలార్ దేవులపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పై టీఆర్ఎస్ నేతలు దాడికి దిగినట్లు తెలుస్తుంది. తన కారుపై టీఆర్ఎస్ నేతలు రాళ్ళూ విసిరారని కార్పొరేటర్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైన్ట్ చేశారు. దుర్గానగర్ లో జరుగుతున్న రోడ్డుపనులను పరిశీలించడానికి వెళ్తుండగా సుమారు 30 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తనను అడ్డగించి దాడి చేశారని అన్నారు. రాళ్లతో కారుపై దాడి చేశారని తెలిపారు.

పనుల్లో నాణ్యత లేదని. ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకే దాడి జరిగినట్లు చెబుతున్నారు కార్పొరేటర్. పనులు పరిశీలించటానికి నువ్వు ఎవరు అది అధికారులు చూసుకుంటారు నీకేం పని అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారని పోలీస్ స్టేషన్ లో కంప్లంట్ చేశారు. ఈ దాడిలో కారు అద్దం పగిలింది.. ఆ కారులోనే శ్రీనివాసరెడ్డి మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు.

బీజేపీ కార్పొరేటర్ కారుపై దాడి