సీఎం జగన్ ను కలిసిన బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి.

1488

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు వెళ్లారు. గత వారం కరోనాతో మృతిచెందిన చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అరగంటకు పైగా మాట్లాడారు. వారికి దైర్యం చెప్పారు. చల్లా కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.

కాగా సీఎం పర్యటన నేపథ్యంలో ఇంచార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, పాణ్యం మాజీ శాసన సభ్యుడు బెజ్జం పార్ధసారధి రెడ్డి, వైసీపీ యువనేత సిద్దార్ధ్ రెడ్డి ఉన్నారు. ఇక జగన్ తిరుగు ప్రయాణంలో సిద్దార్ద్ రెడ్డిని దగ్గరకు పిలుచుకొని మాట్లాడారు సీఎం. నందికొట్కూరు రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా జగన్ వస్తున్నారని తెలిసి ఆ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చాలా రామకృష్ణారెడ్డి స్వగ్రామం అవుకు వచ్చారు.