Bird flu : వికారాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం

82

కరోనా వైరస్ మనుషులను పొట్టన పెట్టుకుంటే బర్డ్ ఫ్లూ పక్షుల జీవం తీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ మహమ్మారి కోరలు చాచింది. దింతో పక్షులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. మొదట రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ లలో కనిపించిన ఈ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు చుట్టపు చూపుగా వచ్చే వలస పక్షులు బర్డ్ ఫ్లూను మోసుకొచ్చాయి. దింతో కోళ్లు, కాకులు, పక్షులు మృతి చెందుతున్నాయి.

ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో పక్షులు మృతి చెందుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మంగళవారం నుంచి వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు వరుసగా మృత్యువాత పడుతున్నాయి అని తెలుస్తోంది. ఈ విషయాన్నీ గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చేరుకున్న అధికారులు కొన్ని శాంపిల్స్ తీసుకోని ల్యాబ్ కి పంపారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. వైద్యులు కూడా ఇవి బర్డ్ ఫ్లూ లక్షణాలే అని చెబుతన్నారు. బుధవారం పక్కమండలంలో కూడా పక్షాలు మృతి చెందినట్లుగా అధికారులు గురించారు.

Bird flu : వికారాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం