చరిత్రలో ఎప్పుడు లేదు..ఒకే కేసులో 9 మందికి మరణశిక్ష

89

Nine get death sentence : బీహార్ కల్తీ సారా కేసులో 9 మందికి మరణశిక్ష విధిస్తూ స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. ఒక కేసులో 9 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇక ఈ కేసులో ప్రేమేయం ఉన్న మరో నలుగురు మహిళలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవితఖైదు పడిన నలుగురు మహిళలు రూ. 10లక్షల జరిమానా కూడా విధించింది న్యాయస్థానం. ఈ కేసు వివరాలను ఒకసారి పరిశీలిస్తే, 2016లో బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ లో కల్తీ సారా సేవించి 21 మంది మృతి చెందారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. వీరిలో కొందరు చూపు కూడా కోల్పోయారు.

అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మద్యపాన నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాలను తుంగలోతొక్కి కొందరు ఓ టీంగా ఏర్పడి నాటుసారా తయారుచేసి అక్రమంగా అమ్మకాలు చేపట్టారు. ఇలా చేయడం మూలంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపింది. నాటు సారా తయారీ వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

చరిత్రలో ఎప్పుడు లేదు..ఒకే కేసులో 9 మందికి మరణశిక్ష