big update: ఢీ గ్లామరైన స్టైలిష్ స్టార్.. పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్!

179

big update: మెగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. మెగా అల్లుడు, స్టైలిష్ స్టార్ allu arjun ప్రస్తుతం sukumar దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసింది యూనిట్. స్వాతంత్ర దినోత్సవ బహుమతిగా ఆగష్టు 13న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. పనిలో పనిగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఇందులో బన్నీ పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరు. కానీ ఈ పోస్టర్ చూస్తే ఈ సినిమాలో ఊర మాస్ నుండి డీ గ్లామర్ పాత్రలోకి మారినట్లుగా కనిపిస్తుంది.

తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో బన్నీ గుబురు గడ్డంతో గొడ్డలి చేత పట్టి రఫ్ లుక్ లో వైల్డ్ గా కనిపించడం సినిమా ఎలా ఉండబోతుందో చూపించినట్లుగా ఉంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కల స్మగ్లింగ్, లారీ డ్రైవర్ గా కనిపించనుండగా తనకు జోడీగా rashmika గిరిజన యువతిగా కనిపించనుంది. ఆర్య లాంటి క్రేజీ హిట్ ఇచ్చిన సుకుమార్ తో చాలా ఏళ్ల తర్వాత బన్నీ నటిస్తుండగా devi sri prasad మరోసారి బన్నీ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐదు ఇండియన్ బాషలలో విడుదల కానున్న ఈ సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలే పెట్టుకోగా యూనిట్ అంతకంతకు అంచనాలను పెంచేస్తుంది.