ట్విటర్‌కు భారీ షాక్.. యాడ్స్ బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

221

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేసి 12 శాతం షేర్ వ్యాల్యూ కోల్పోగా తాజాగా మరో షాక్ తగిలింది. ఇకపై ట్విట్టర్ ఎటువంటి ప్రకటనలు తీసుకోవద్దని టర్కీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. టర్కీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సోషల్ మీడియా చట్టాన్ని అమలు చేయడంలో ట్విట్టర్ విఫమైనట్లు ఆదేశ ప్రభుత్వం భావించింది. దింతో ట్విట్టర్ పై నిషేధం విధించింది. ఇప్పటికే షేర్ వ్యాల్యూ పడిపోయి కష్టాల్లో ఉన్న ట్విట్టర్ ఈ దెబ్బతో మరింత దిగజారినట్లు అయింది. అయితే ఏదైనా సోషల్ మీడియా యాప్ ఆ దేశ చట్టాలకు అనుగుణంగా పని చెయ్యాల్సి ఉంటుంది. లేదంటే దానిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది

ప్రకటనల బ్యాన్ విధించడానికి గల కారణాలను ఒకసారి పరిశీలిస్తే.. టర్కీ కొత్త సోషల్ మీడియా చట్టం ప్రకారం.. సామాజిక మాధ్యమాలన్నీ స్థానికుడైన ఓ ప్రతినిధిని నియమించుకోవాల్సి ఉంటుంది. విషపు ప్రచారం, అసత్య ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లను తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రతినిధిపై ఉంటుంది. అయితే..ఫేస్‌బుక్ కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం అమలు పరచడం లేదు దింతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. కాగా యూట్యూబ్ ట్విట్టర్ లు ఇప్పటికే టర్కీ ప్రభుత్వానికి భారీ జరిమానాలు కట్టి ఉన్నాయి. ఇదే సమయంలో ప్రకటనలు నిషేధించడంతో ట్విట్టర్ కి వచ్చే ఆదాయానికి గండిపడింది.

ట్విటర్‌కు భారీ షాక్.. యాడ్స్ బ్యాన్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం