సీఎం మమతకు మరో షాక్.. టీఎంసీకి మంత్రి రాజీనామా

1139

పశ్చిమ బెంగాల్ సీఎంకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. గత ఏడాది సువెందు అధికారి జరినామా చేశారు. పార్టీలో కీలక నేతగా ఉన్న సువెందు రాజీనామాతో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కొద్దిరోజులకే సువెందు అధికారి సోదరుడు తృణమూల్ కు రాజీనామా చేశారు.

ఇక మంగళవారం బెంగాల్ క్రీడాశాఖ సహాయమంత్రి మాజీ క్రికెటర్ లక్ష్మణ్ రతన్ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ హౌరా జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు రతన్. కాగా ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న రాజకీయాలపై అతడు విసుగుచెందినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తృణమూల్ లోని బలమైన నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తృణమూల్ లోని ప్రధాన నేత సువెందుని బీజేపీ చేర్చుకుంది. ఆయనతోపాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.