బిగ్ బాస్ చెక్కుతో బంగారం కొన్న గంగవ్వ

55

మై విలేజ్ షో ద్వారా ఫేమస్ అయిన గంగవ్వ, ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటిస్తున్న గంగవ్వకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది. బిగ్ బాస్ హౌస్ కి రావాలని నిర్వాహకులు ఆమెను కోరారు. దింతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దీ రోజులపాటు ప్రేక్షకులను అలరించింది. మంచి మార్కులు కొట్టేసింది.

తన మాటలతో అభిమానులను ఆకట్టుకుంది. అనారోగ్య కారణాల వలన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బిగ్ బాస్ లోని అనుభవాలను పంచుకుంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ లో వచ్చిన చెక్కుతో హైదరాబాద్ లక్ష రూపాయాల బంగారం కొనుగోలు చేసింది. మై విలేజ్ షో యాక్టర్, గంగవ్వ మనవడు శ్రీకాంత్ ను తీసుకెళ్లి బంగారం తెచ్చుకుంది గంగవ్వ. కాగా ప్రస్తుతం ఆమె తన సొంత ఊర్లోనే ఉన్నారు. కొత్త ఇల్లు కడుతుడటంతో ఆ పనుల్లో బిజీగా ఉన్నారు గంగవ్వ.

బిగ్ బాస్ చెక్కుతో బంగారం కొన్న గంగవ్వ