సింహం ఎక్కడున్నా సింహమే – భూమా మౌనిక

1019

భూమా అఖిలప్రియను సరైన ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని ఆమె సోదరి భూమా మౌనిక ఆరోపించారు. ఆళ్లగడ్డలో తమ అనుచరులతో ఆమె సమావేశం నిర్వహించారు. రాత్రి సమయంలో మహిళా పోలీసులు లేకుండా భూమా అఖిల ప్రియను తీసుకెళ్లారని అన్నారు. కమిషనర్ కార్యాలయంలో తాను అఖిల ప్రియాను కలవాలని ప్రయత్నిస్తే తనను వెనక్కు పంపారని అన్నారు. గాంధీ ఆసుపత్రి వద్దకూడా అదే పరిస్థితి అని తెలిపారమే. ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. భూమా పిల్లలను ఎదగకుండా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారమే. ఎంత కొడితే అంత పైకి లేస్తామని మౌనిక తెలిపారు. సింహం బోనులో ఉన్న రోడ్డుపై ఉన్న సింహం సింహమే అని అన్నారామె