పాక్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్..

79

భారత్ పాకిస్థాన్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసేందుకు సిద్దమవుతుంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. రైతు ఉద్యయం ప్రపంచ దేశాల దృష్టిలో పడటంతో దానిని మరల్చేందుకు భారత్ పాకిస్థాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఒక కీలక నివేదికను ఆ దేశ ప్రభుత్వానికి అందించింది. ఇప్పటికే సరిహద్దుల్లో భారత్ ఆర్మీ సరిహద్దుల్లో దుందుడుకుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కాగా బుధవారం నుంచి సరిహద్దుల్లో భారత ఆర్మీ బీకర కాల్పులు జరుపుతుంది. ఈ కాల్పుల్లో 10 మందికిపైగా పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం.

పాక్ పై మరోసారి సర్జికల్ స్ట్రైక్..

భారత సైన్యం విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేయాలని పాక్ ఇంటిలిజెన్స్ సూచించింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ముఖ్యంగా, భారత్‌లోని నిరసనలను బలహీనపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా చేయడానికి సిద్ధపడతారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. రైతుల ఉద్యమం మరో ఖలిస్థాన్ ఉద్యమంలా మారేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోదని వ్యాఖ్యానించింది. ఒకవేళ భారత్ అనుకోని విధంగా దాడులకు పాల్పడితే ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలని పాక్ ఇంటిలిజన్స్ అధికారులు సైన్యానికి తెలిపారు.

ఇక మరోవైపు రైతు ఉద్యమమా 15 వ రోజు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం చట్టంలో కొన్ని సవరణలు చేస్తామన్న రైతు సంఘాల నేతలు ఒప్పుకోవడం లేదు. మొత్తం బిల్లునే రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తలదాచుకుంటున్నారు.