పాక్ అనుమతించలేదు.. కానీ భారత్ అనుమతించింది.

492

అంతర్జాతీయ ప్రోటోకాల్ ప్రకారం దేశాధినేతలు వీవీఐపీ విమానాలు ఏ ఇతర దేశాల గగనతలం గుండా వెళ్లినా దానికి అనుమతి తీసుకోవాలి. కొన్ని దేశాలు తమ గగనతలంపై శత్రు దేశాల నేతల విమానాలు ఎగిరితే ఒప్పుకోవు.. ఇదే సమస్య భారత్ కూడా ఉంది. భారత్ విమానాలు పాకిస్థాన్ గగనతలం నుంచి వెళ్లేందుకు అవకాశం లేదు. గతంలో ఓ సారి రాష్ట్రపతి, ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లే సమయంలో అనుమతి కోరుతూ భారత ఎయిర్ లైన్స్ పాక్ ఎయిర్ లైన్స్ కు లేఖరాసింది. అయితే వారు ఒప్పుకోలేదు.. తాము అనుమతి ఇవ్వమని తేల్చేశారు.

దింతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీలు వేరే మార్గంలో పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇదే అవసరం ఇప్పుడు పాక్ కి వచ్చింది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేడు శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నారు (ఫిబ్రవరి 23న) అయితే ప్రధాని విమానాన్ని భారత గగనతలంపై అనుమతించాలంటూ భారత్ ను పాక్ అభ్యర్ధించింది. పాక్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న భారత్ అనుమతి ఇచ్చింది. నాడు భారత విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణించేందుకు పాకిస్థాన్ నిరాకరించినా, భారత్ మాత్రం పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రయాణించే విమానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది.

పాక్ అనుమతించలేదు.. కానీ భారత్ అనుమతించింది.