సీఐడీ డీఎస్పీ లక్ష్మి ఆత్మహత్య

81

బెంగళూరులో ఒక లేడీ సిఐడి అధికారి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను పివి లక్ష్మిగా గుర్తించారు. డీఎస్పీ ర్యాంక్ అధికారి అయిన లక్ష్మిని కొద్దిరోజుల క్రితమే నేర పరిశోధన విభాగంలో పోస్ట్ చేశారు. అందిన వివరాల ప్రకారం, 33 ఏళ్ల లక్ష్మి గత రాత్రి తన స్నేహితురాలు ఇంటికి విందు కోసం వెళ్లారు. అయితే అక్క‌డ రాత్రి 10:30 గంటల సమయంలో ఓ గదిలోకి వెళ్లిన లక్ష్మి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించారు.

లక్ష్మి స్నేహితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి పంపారు. కాగా క‌ర్ణాట‌క ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా 2014లో నిర్వ‌హించిన సీఐడీ ఎగ్జామ్‌లో లక్ష్మీ ఉత్తీర్ణ‌త సాధించారు. శిక్ష‌ణ అనంత‌రం 2017లో ఉద్యోగంలో చేరారు.