సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలా..!

209

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. యోగా, సూర్య నమస్కారాలు, నదీస్నానాలు, సముద్ర సానాలు, ఉపవాసాలు ఇలా పలు రకాల ప్రక్రియలు మనకు ఉన్నాయి. అయితే ఇందులో ఈజిగా ప్రతి ఒక్కరు చేయడానికి వీలయ్యే వాటిలో పన్నెండు భంగిమలతో చేసే సూర్య నమస్కారాలు మొదటగా చెప్పుకోవచ్చు. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. ఈ ఆసనాలు చేయడానికి రోజులో పదినిమిషాల కంటే ఎక్కువ పట్టదు. దీనివల్ల వచ్చే ఆరోగ్యలాభాలు కూడా చాలానే ఉన్నాయి. సాధారణంగా వివిధ ఆసనాలు, ప్రాణయామాలు చేసే వారు కూడా చివరిగానో, మొదట్లోనో ఈ సూర్య నమస్కారాలు చేస్తుంటారు.

అయితే, కేవలం సూర్య నమస్కారాలు చేసినా కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు యోగా నిపుణులు. సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలు సహజ సిద్ధంగా తొలగిపోతాయి. ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుందట. అలాగే నడుము సన్నబడుతుందట.. అంతేకాదు రోగ నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు. కాగా ఈ ఆసనాలలో ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస,వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించినట్టయితే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.