అనారోగ్యానికి గురైన సౌరవ్ గంగూలీ

94

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ శనివారం ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. కోల్ కత్తాలోని తన ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మత్తుగా ఉండటంతో వెంటనే వుడ్ ల్యాండ్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన డాక్టర్లు హార్ట్ లో చిన్న సమస్య తలెత్తినట్లు గుర్తించారు. ఈ రోజు సాయంత్రం యాంజియోప్లాస్టీ చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు సమాచారం.

కాగా ఆసుపత్రికి రాగానే ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు చేశారు. ఎక్కువగా అలసిపోవడం వలన ఇటువంటి సమస్య వస్తుందని తెలిపారు. ఇక దాదా త్వరగా కోలుకోవాలని టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ ట్వీట్ చేశారు. ఆయనతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, ఐసీసీ కూడా త్వరగా రికవరీ కావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.