“బ్యాన్ తాండవ్”.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్

750

బాలీవుడ్ లో వివాదాలు సర్వసాధారణం. గతంలో చాలా సినిమాలకు వివాదాలపాలై నిలిచిపోయాయి. కొన్ని సినిమాలు అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి రిలీజ్ చేశారు. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు.

హిందూ దేవి దేవతలను కించపరిచేలా ఈ వెబ్ సిరీస్ లో సీన్స్ ఉన్నాయని పలువురు ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దేశ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఈ వెబ్ సిరీస్ పై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తున్నారు హిందువులు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా “బ్యాన్ తాండవ్” బాయికాట్ సైఫ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

వెబ్ సిరీస్ పై తీవ్ర వ్యతిరేక వస్తుండటంతో ముందు జాగ్రత్తగా సైఫ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. అలీఖాన్, డింపుల్ కపాడియా తదితరులు నటించారు.. అమెజాన్ ప్రైమ్ లో ఇది విడుదల కానుంది.

“బ్యాన్ తాండవ్”.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్