బెంగాల్ లో మమతకు షాక్ ఇవ్వనున్న ఎంఐఎం

340

ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమని ఇంతకాలం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎంఐఎం దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం బరిలో దిగుతుంది. ఎంఐఎం దెబ్బకు అంచనాలు తారుమారవుతున్నాయి. ప్రధానంగా ఎంఐఎం పోటీలో ఉంటే బీజేపీకి కలిసొస్తుంది. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో తేజశ్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని అందరు అనుకున్నారు.

రిజల్ట్స్ రోజు కూడా వారి కూటమికి 160 సీట్లు వస్తాయని చాలా మంది జోశ్యం చెప్పారు. కానీ చివరకు తేజశ్వి యాదవ్ సీఎం పీఠానికి చెరువులోకి వచ్చి ఓటమి చెందారు.. ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఓటమికి ప్రధాన కారణం ఎంఐఎం అని చెప్పుకుంటున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కు పడే ముస్లిం ఓటు బ్యాంకును ఎంఐఎం తిప్పుకోవడంతో సీట్లు తగ్గాయి. దింతో సీఎం పీఠం ఈ కూటమికి దూరమైంది. ఎంఐఎం పోటీ చెయ్యడం వలన ఎన్డీయే కూటమికి కలిసొచ్చిందని చెప్పవచ్చు.

ఇక పశ్చిమ బెంగాల్ కూడా ఎంఐఎం పోటీ చేసేందుకు సిద్దమవుతుంది. ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు 30 శాతం ఉంటుంది. వీరంతా తృణమూల్ కు అండగా ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తే తృణమూల్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. 50 స్థానాల్లో విజయాన్ని డిసైడ్ చెయ్యగల బలం ముస్లిం ఓటర్లకు ఉంది.

ఒకవేళ ఎంఐఎం బరిలోకి దిగితే తృణమూల్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఇక ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఓ సభలో మాట్లాడుతూ,బీజేపీ ఎంఐఎం మత పరంగా ఓటర్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తృణమూల్ ను దెబ్బ కొట్టేందుకు బీజేపీ ఎంఐఎంతో ఒప్పందం చేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి అండగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని మండిపడ్డారు.

కానీ బెంగాల్ లో వారి ఆటలు సాగవని, హైదరాబాద్ పార్టీని బెంగాల్ ప్రజలు నమ్మరని ఆమె వ్యాఖ్యానించారు. ఎంఐఎం బెంగాల్ లో పోటీ చేసి తృణమూల్ కు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 బెంగాల్ లో మమతకు షాక్ ఇవ్వనున్న ఎంఐఎం