కేసీఆర్ సీఎం నుంచి తన మొదటి వృత్తి వరకు వెళ్తారు – బండి

73

కేసీఆర్ యూ టర్న్ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రైతు చట్టాలపై సీఎం కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. మొదట చట్టాలను వ్యతిరేకించి, రైతుల బంద్ కు మద్దతిచ్చిన కేసీఆర్, ఈ రోజు యూ టర్న్ తీసుకోవడం ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకొచ్చారు.

రిజిస్ట్రేటిన్ల విధానాన్ని కూడా పాతపద్ధతికి మార్చారని, అన్ని విషయాల్లో కేసీఆర్ యూ టర్న్ తీసుకుంటున్నారని అన్నారు. ఇన్నిరోజులు సీఎం కేసీఆర్ రైతు చట్టాన్ని రోజుకో పేజీ లెక్కన చదివారని, అందులో ఎటువంటి తప్పులు లేకపోవడంతో మద్దతు ఇచ్చారని తెలిపారు. అయితే రైతు కొనుగోలు కేంద్రాలను తీసేస్తాం అని కేసీఆర్ అనడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని తెలిపారు బండి.

రైతు వేదికల ద్వారా రైతుల పంటను కొనుగోలు చెయ్యాలని ఆయన తెలిపారు. రైతుల్ ధాన్యం కొనుగోలు చెయ్యకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తుగ్లక్ పాలనను మైమరపించే విధంగా కేసీఆర్ పాలన ఉందని ఎద్దేవా చేశారు బండి. కేసీఆర్ ఎక్కడైతే తన జీవిత ప్రస్థానం మొదలు పెట్టారో, అక్కడే అంతం కాబోతున్నారని పాస్ పోర్ట్ వ్యాపారాన్ని గురించి ప్రస్తావించారు. రైతుల పంటను కొనుగోలు చెయ్యకపోతే ఉద్యమం చేస్తామని బండి అన్నారు.

కేసీఆర్ సీఎం నుంచి తన మొదటి వృత్తి వరకు వెళ్తారు – బండి