ఇది ప్రభుత్వ హత్య :- బండి సంజయ్

289

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ హత్యోదంతాన్ని రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కుంట శ్రీనివాస్, మరో వ్యక్తి కలిసి వీరిని హత్యచేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కుంట శ్రీనివాస్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మండల నాయకుడిగా ఉన్నాడు.

ఇక గురువారం వామన్ రావు తల్లిదండ్రులను భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, పలువురు భాజపా నేతలు పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితులకు కఠిన శిక్ష పడేవరకు పోరాడతామని బండి సంజయ్ వామన్ రావు కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. వామన్‌రావు దంపతుల హత్యపై తెరాస నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వ ప్రమేయంతో పథకం ప్రకారమే వామన్‌రావు దంపతులను హతమార్చారన్నారు. నిందితులను ఎన్కౌంటర్ చెయ్యాలని చూస్తే ప్రజలు తిరగబడతారని, నిందితులను విచారణ చేసి వీరి వెనక ఉన్నవారిని గుర్తించాలని కోరారు. దీనిపై వెంటనే సీఎం స్పందించాలి” అని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ ఈ రోజు హైకోర్టు న్యాయవాదులు విధులకు దూరంగా ఉన్నారు. వామన్ రావును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని న్యావాదులు కోరుతున్నారు. కాగా ప్రభుత్వంలో జరుగుతున్న పలు అవకతవకలపై వామన్ రావు దంపతులు గతంలో హైకోర్టుకు పలు లేఖలు రాసినట్లుగా తెలుస్తుంది.

ఇసుక దందాపై కూడా వారు హైకోర్టులో ఫిర్యాదు చేశారు. పలువురు పోలీసులపై కూడా కోర్టుకు వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా గతంలో తమకు ప్రాణహాని ఉందని ఈ దంపతు హైకోర్టును ఆశ్రయించారు. దింతో వారికీ భద్రతా కల్పించాలని పోలీస్ శాఖకు హైకోర్టు తెలిపింది. కానీ పోలీసులు ఇప్పటివరకు వారికీ భద్రత కల్పించలేదు.. ఈ విషయమై ఈ ఇద్దరు దంపతులు అనేక సార్లు పోలీస్ ఉన్నతాధికారులను కూడా కలిశారని సమాచారం.

ఇది ప్రభుత్వ హత్య :- బండి సంజయ్