యూకే విమాన సర్వీసులపై నిషేధం విధించిన భారత్

71

బ్రిటన్ లో కరోనావైరస్ కొత్త వేరియంట్స్ తరువాత ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా, బ్రిటన్ నుండి వచ్చే విమానాలను ఆపాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 22న రాత్రి 11.59 గంటల నుండి డిసెంబర్ 31 వరకు 11.59 గంటల వరకూ యూకే విమానాలపై నిషేధం విధించాలని నిర్ణయించింది. రేపటినాటికి భారతదేశానికి వచ్చేవారికి విమానాశ్రయంలోనే RT-PCR పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

కాగా యూకేలో కరోనావైరస్ ఉత్పరివర్తనలు వెలుగులోకి వచ్చాయి. దీనికి VUI-202012/01 అని పేరు పెట్టారు. ఇది మునుపటి వైరస్ కంటే 70% ఎక్కువ సంక్రమణను వ్యాప్తి చేస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా, భారతదేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. మరోవైపు, బ్రిటన్ లో ఉద్భవించిన కొత్త కొరోనావైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అన్నారు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.