కొత్త ఇల్లు కొన్న బాలయ్య

269

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్ లో ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 15 కోట్లుగా తెలుస్తుంది. ఇదివరకు బాలయ్యకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 లో పెద్ద భవంతి ఉండగా.. ఇది రెండోవది. రెండంతస్థుల ఆ ఇల్లు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ అయిందట. కొత్తగా కొన్న ఇంటిని లగ్జీరియస్‌గా డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త ఇంట్లో పనులు పూర్తవగానే బాలయ్య పాత ఇంటిని ఖాళీ చేసి అక్కడికి వెళ్తారని తెలుస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య.. తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు. ప్రస్తుతానికైతే బీబీ3 అనే పిలుచుకుంటున్నారు అభిమానులు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. దీని తర్వాత ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నాడు నందమూరి హీరో. ఓ వైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు బాలయ్య.

కొత్త ఇల్లు కొన్న బాలయ్య