టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి

86

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తన నివాసం నుంచి టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో సుమారు పదిమంది వ్యక్తులు కారుపై దాడి చేశారు. ఈ దాడిలో పట్టాభికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దాడి అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారు. అయితే పట్టాభి డ్రైవర్ పై కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది. గాయాలతో పట్టాభి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మోచేతికి, కాలుకి గాయాలు అయినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పట్టాభిపై దాడి జరగడం ఇది రెండవ సారి. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడి కారు అద్దాలను ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై పట్టాభి మాట్లాడుతూ పదిమంది వ్యక్తులు తనపై దాడి చేశారని తెలిపారు. డ్రైవర్ ను కూడా కొట్టారని, ఇనుపరాడ్లు కర్రలను తీసుకోని వచ్చారని వివరించారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని కోరారు. మరోవైపు దాడిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. దాడిని కండించారు. పట్టాభి ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపారు.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి