టీడీపీ నేతలపై రాళ్లతో దాడి.. మండిపడ్డ అచ్చెన్నాయుడు

74

చిత్తూరు జిల్లా కురబల కోట మండలం అంగళ్లులో సమావేశానికి వెళ్తున్న టీడీపీ నేతల వాహనాలపై వైసీపీ నేతలు రాళ్ళూ కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో 4 వాహనాలు పాక్షికంగా ధ్వంసం అవగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పార్టీ అధ్యక్షుడు అచ్చెనాయుడు స్పందించారు. ఈ దాడి అమానుషమని అభిప్రాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ నేత రాటకొండ మధుబాబు తలకు తీవ్ర గాయలయ్యాయని. నాలుగు కార్లు ద్వంసం అయ్యాయని తెలిపారు. సమావేశానికి వెళ్తున్న వారిని అడ్డుకొని ఈ దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు.

టీడీపీ నేతలపై రాళ్లతో దాడి.. మండిపడ్డ అచ్చెన్నాయుడు