పెళ్లి ఊరేగింపులో దారుణం

79

పెళ్లి ఊరేగింపులో దారుణం జరిగింది. నలుగురి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారం గ్రామంలో యువకుడిని దారుణంగా హత్యచేశారు. పెళ్లి ఊరేగింపులో లక్ష్మణ్‌ అనే యువకుడితో ముగ్గురు యువకులకు వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. దింతో ముగ్గురు యువకుల్లో ఒకరు కత్తితో లక్ష్మణ్‌ పై దాడి చేశాడు. దింతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సై సుధీర్ రావు పరిశీలించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ఆ ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఉన్నట్లుగా సమాచారం.

 

పెళ్లి ఊరేగింపులో దారుణం