ఏటీఎంను ఎత్తుకెళ్లిన అంతర్‌రాష్ట్ర దొంగలు

78

ఆదిలాబాద్‌ జిల్లాలో ఏకంగా ఏటీఎంనే ఎత్తుకెళ్లారు దొంగలు.. ఈ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ చౌరస్తా వద్ద జరిగింది. ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు.. క్యాష్‌ బాక్సును పగులగొట్టి నగదును దొంగిలించారు. అనంతరం ఏటీఎం మిషన్‌ను జనసంచారం లేని ప్రాంతంలో వదిలివెళ్లారు.. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. నిందితులను అంతర్‌రాష్ట్ర దొంగలుగా గుర్తించారు.

ప్రస్తుతం వారికోసం నాలుగు బృందాలుగా ఏర్పడి అన్వేషణ చేస్తున్నారు. కాగా కలెక్టరేట్ చౌరస్తా వద్దకంటే ముందే ఈ దొంగల ముఠా మొదట.. సోనార్ బజార్ ప్రాంతంలో వైష్ణవి జ్యువెలరీలో చోరీ చేయడానికి ప్రయత్నం చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది.. అయితే ఇది కుదరకపోవడంతో కలెక్టర్ చౌరస్తాలో ఏటీఎంను తాళ్లతో కట్టి వాహనంలోకి ఎక్కించి అపహరించారని స్థానిక డిఎస్పీ వెల్లడించారు.