నెక్స్ట్ హోంమంత్రి నేనే.. ఒక్కడిని కూడా వదలను – అచ్చెన్నాయుడు

228

టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు. తదుపరి హోంమంత్రి అవుతానని, ఒక్కరిని కూడా వదలమని వైసీపీ నేతలను హెచ్చరించారు. పోలీసులను కూడా గుర్తుపెట్టుకుంటానని ఘాటుగా మాట్లాడారు.సీఐ, ఎస్సై తన బెడ్ రూమ్ లోకి వచ్చి దౌర్జన్యం చేశారని అచ్చెన్న ఆరోపించారు.

తాను నిజంగా తప్పుచేశానని భావిస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయాలని హితవు పలికారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడుకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిమ్మాడ సర్పంచిని బెదిరించాడన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దింతో పోలీసులు ఆయనను జైలుకు పంపారు.

 

నెక్స్ట్ హోంమంత్రి నేనే.. ఒక్కడిని కూడా వదలను – అచ్చెన్నాయుడు