ఆసుపత్రిలోనే వధువు మేడలో తాళికట్టిన వరుడు.

117

పెళ్లి అనేది జీవితంలో మరపురాని మధురానుభూతి. పెళ్లి వేడుకను తమ స్తోమతను బట్టి జరుపుకుంటారు. అయితే కొన్ని సార్లు పీఠల వరకు వచ్చిన పెళ్లిళ్లు కూడా ఆగిపోతాయి. కట్నం ఇవ్వలేదనో, వధూవరులకు ఇష్టం లేకనో ఆగిపోతున్నాయి. కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైన అనుకున్న సమయానికి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటే, కట్నం, ఆరోగ్యం ఏవి అడ్డురావని ఓ యువకుడు నిరూపించాడు. పెళ్లి చేసుకోబోయే వధువు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో ఉండగా బంధుగణంతో వెళ్లి ఆసుపత్రిలోనే తాళి కట్టాడు వరుడు.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ప్రయాగ్‌రాజ్‌ జిల్లాకు చెందిన అద్వేష్‌, ఆర్తిలకు పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఇందుకోసం ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ప్రమాదవశాత్తూ పెళ్లి జరిగే రోజునే వధువు ఆర్తి ఇంటికప్పు నుంచి జారి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు, వెన్నెముకకు గాయాలయ్యాయి. దింతో ఆమెను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఈ ప్రమాదంలో వధువు కదల్లేని స్థితిలోకి వెళ్లిపోయారు. కాళ్ళు, వెన్నుముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. పెళ్లి మండపం వరకు తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో ముహూర్తం సమయానికి వధువు నిదుటిపై బిట్టు పెట్టి తాళి కట్టాడు వరుడు..

కాగా ఈ ఘటనపై డాక్టర్ సచిన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఆర్తి వెన్నెముకకు గాయమైంది. కాళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం తాను నడిచే స్థితిలో లేదు. కానీ ఈరోజే తన పెళ్లి జరగాల్సి ఉంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లి తంతు నిర్వహించేందుకు అనుమతినిచ్చాం. కాళ్లు మాత్రం కదపొద్దని తెలిపాం. ఆ జంటను చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది’’ అని పేర్కొన్నారు.

ఇక పెళ్లిపై వరుడు అద్వేష మాట్లాడుతూ. తనతో జీవితాంతం కలిసి ఉంటానని మాట ఇచ్చాను.. తాను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం తన బాధ్యత అందుకే బంధుగణంతో వచ్చి పెళ్లి చేసుకున్నాను అని తెలిపారు. పెళ్లి గురించి వధువు మాట్లాడుతూ తాను ఆపదలో ఉన్న విషయం తెలుసుకొని తన దగ్గరకు వచ్చి దైర్యం చెప్పి, తనను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చారని, ఇంతకంటే తనకేం కావాలని తెలిపారు.

 

ఆసుపత్రిలోనే వధువు మేడలో తాళికట్టిన వరుడు.