ఎన్నికల సమయంలో ఆస్తులు ధ్వంసం

216

పంచాయితీ ఎన్నికలు పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య కుమ్ములాటరు తారాస్థాయికి చేరాయి. నామినేషన్ వెయ్యకుండా అడ్డుకుంటున్నారు. వేసిన తర్వాత విత్ డ్రా చేసుకోవాలని బెదిరింపులకు దిగుతున్నారు. ఇటువంటి ఘటనలు కోకొల్లలు. ఇక గురువారం రాత్రి అనంతపురం జిల్లాలో సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓబిరెడ్డి అనే వ్యక్తికీ చెందిన గడ్డి వామిని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

గార్లెదిన్నె మండలం, గుడ్డలపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీంతో రూ. లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రత్యర్థులు ఇలా చేశారని ఆరోపించారు. గడ్డివాము దగ్ధం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. గడ్డివామి తగులబడటంతో పశువులకు మేత లేకుండా పోయిందని ఓబిరెడ్డి వాపోయారు.

గతవారం కృష్ణా జిల్లాలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. నామినేషన్ వేసిన రోజే గుర్తు తెలియని వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థి ఇంటిముందు ఉన్న బైక్ లకు నిప్పుపెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో కారు అద్దాలు ధ్వంసం చేశారు.

ఎన్నికల సమయంలో ఆస్తులు ధ్వంసం