అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం

45

మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ అవుతుంది. ప్రివిలేజ్ కమిటీ ఏర్పడ్డాక తొలిసారిగా ఈ సమావేశం అవుతోంది. సభను తప్పుదోవ పట్టించారంటూ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు సీఎం జగన్. అయితే సీఎం జగన్, మంత్రి కన్నబాబు పైనా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు.. ఈ నోటీసులపై కూడా కమిటీ చర్చించనుంది.