Guntur man పేకాట కోసం 50 ఎకరాలు అమ్మిన ఆసామి. చివరకు దొంగలా మారాడు

122

జూదం చాలా ప్రమాదకరమని పెద్దలు చెబుతుంటారు. జూదం వలన రాజ్యాలను కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. జూదం అనేది మనిషికి ప్రమాదకరమైన అవలక్షణం. దీని బారినపడి కుటుంబాలను కూడా మర్చిపోతుంటారు కొందరు. ఇక జూదానికి అలవాటు పడిన ఓ వ్యక్తి తనకున్న 50 ఎకరాలు అమ్మి, చివరకు దొంగలా మారాడు. ఇళ్లలో దూరి చోరీలకు పాల్పడ్డారు. ఆయన పిల్లలు విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న జూదం మాత్రం మరువలేదు.

నగరంలో జరిగిన ఓ దొంగతనంతో మాజీ ఆసామి చరిత్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్​ జెక్ కాలనీలోని క్లాసిక్ ఆర్కేడ్ అపార్ట్​మెంట్​ లో నవంబర్ 20 తేదీన దొంగతనం జరిగింది. ఈ అపార్ట్ మెంట్​లోని 501 ఫ్లాట్​లో ఆర్​బీఐ రిటైర్డ్ ఉద్యోగి శేషసాయి దంపతులు ఉంటున్నారు. ఫ్లాట్ గొళ్లెం పగలగొట్టి లోపకిలి వెళ్లిన దొంగ 35 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి చోరీ చేశాడు. ఇది గుర్తించిన అపార్ట్​మెంట్ అసోసిషన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దింతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. దొంగతనం చేసింది గుంటూరు జిల్లా క్రోసూరు మండలం 88 తాళ్లూరుకు చెందిన రాయపాటి వెంకట్రావు అని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి నిందుతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు వెంకట్రావు విషయం తెలిసి పోలీసులు షాకయ్యారు.

నిందితుడు వెంకట్రావు మాములు వ్యక్తి కాదని తెలుసుకున్నారు. 50 ఎకరాల భూస్వామి అని తెలిసి కంగుతిన్నారు. అమరావతి ప్రాంతంలో తనకున్న 50 ఎకరాలను గతంలో ఎకరా లక్ష చొప్పున సుమారు రూ.50లక్షలకు విక్రయించి డబ్బు మొత్తం పేకాటకే తగలేశాడని తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు. అరకోటి రూపాయలను పేకాటలో పోగొట్టుకొని మళ్లీ చోరీలకు పాల్పడడం విస్మయానికి గురి చేసింది. పేకాట కోసం, గుంటూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్ళేవాడు. ఇలా తన ఆస్తిని మొత్తం జూదంలో ఆవిరిలా కరిగించాడు. ఇక జూదాన్ని మరువలేక దొంగతనాలు మొదలు పెట్టాడు.

పేకాట కోసం 50 ఎకరాలు అమ్మిన ఆసామి. చివరకు దొంగలా మారాడు