సీజేగా ప్రమాణస్వీకారం చేసిన అరూప్ గోస్వామి

1401

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గోస్వామి చేత ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, పలువురు రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం తేనేటి విందులో పాల్గొన్నారు గవర్నర్, సీఎం జగన్

సీజేగా ప్రమాణస్వీకారం చేసిన అరూప్ గోస్వామి