పాకిస్థాన్ లో అమానుషం.. సొంతపౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ

826

పాకిస్థాన్ సైనికులు సొంత పౌరులపైనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మారణాయుధాలతో ఇష్టానుసారంగా కొట్టారు. జనసంచారం ప్రాంతాల్లో కాల్పులు జరిపి ఇద్దరినీ పొట్టన పెట్టుకోగా మరికొంతమందిని గాయపరిచారు. దాడికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బలూచిస్తాన్ ప్రజలను టార్గెట్ గా చేసుకొని ఆర్మీ దాడులకు దిగుతుందని బలూచ్ రిపబ్లికన్ పార్టీ నేత షేర్ మహమ్మద్ భుగ్తీ ఆరోపించారు. చిన్నపిల్లలను, మహిళలను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని తెలిపారు..

ఈ దాడులకు సంబందించిన వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేశారు మహమ్మద్ భుగ్తీ. ఫిబ్రవరి 9న ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారాయన. పాకిస్థాన్ ఆర్మీ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని తెలిపారు. అమాయకులను కాల్చి చంపుతున్నారని పేర్కొన్నారు. కాగా పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూ హింసకు పాల్పడుతోంది. అంతర్జాతీయ వేదికగా ఎన్నోసార్లు దీనిపై పలు దేశాలు గళమెత్తాయి. తాజాగా మరోసారి పాక్ ఆర్మీ రెచ్చిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారిని టార్గెట్ చేసి కాల్పులకు పాల్పడుతోంది.

 

పాకిస్థాన్ లో అమానుషం.. సొంతపౌరులపై కాల్పులు జరిపిన ఆర్మీ