అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ ఎంట్రీ.. ఏ జట్టు, ఎంత రేటో తెలుసా?

107

చెన్నై వేదికగా 2021 ఐపీఎల్ వేలం జరిగింది. ఐపీఎల్ వేలం కోసం 1,114 రిజిస్టర్ చేసుకోగా అందులో 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 164 మంది భారతీయ ఆటగాళ్లు ఉండగా.. 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిని 8 జట్లు కొనుగోలు చేశాయి. ఎక్కువగా వారికీ నిర్దారించిన ధరకే అమ్ముడు పోయారు ఆటగాళ్లు.. కొందరు ఆటగాళ్లు మాత్రం ఊహించని విధంగా రేటు పలికారు. ఆల్ రౌండర్లు అత్యధిక ధర పలికారు. ప్రాంచేజిలు విదేశీ ఆటగాళ్లపై మక్కువ చూపాయి.

ఇక మాజీ ఇండియన్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ వేలంలో అమ్ముడయ్యాడు. మొదటి సారి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండుల్కర్ ను ముంబై జట్టు దక్కించుకుంది. ముంబై జట్టు చివరి ప్లేయర్ గా అర్జున్ ను కొనుగోలు చేసింది. ఈయనకు రూ. 20 లక్షలు చెల్లించింది. అర్జున్ కు నిర్దేశించిన ధరకూడా 20 లక్షలే.. చాలామంది ఆటగాళ్లు 20 లక్షలకే అమ్ముడుపోయారు.

అర్జున్ టెండుల్కర్ ఐపీఎల్ ఎంట్రీ.. ఏ జట్టు, ఎంత రేటో తెలుసా?